English   

స‌ల్మాన్ రాధే దారిలో సాయి ధ‌ర‌మ్ తేజ్ రిప‌బ్లిక్

Sai Dharam
2021-06-02 17:33:12

కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించిన రాధే సినిమాను జీ5లో పే ప‌ప‌ర్ వ్యూ విధానంలో విడుద‌ల చేశారు. కాగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. టికెట్ ధ‌ర ఎక్కువే అయినప్ప‌టికీ సినిమాను ఎగ‌బ‌డి చూసేసారు. కేవ‌లం ఇండియాలో ఓటీటీలో విడుద‌ల చేయ‌గా ఇత‌ర దేశాల్లో మాత్రం ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేశారు. కాగా తాజా స‌మాచారం ప్ర‌కారం మెగా మేన‌ల్లుడు సాయిధ‌రమ్ తేజ్ హీరోగా న‌టించిన రిప‌బ్లిక్ సినిమాను కూడా పే ప‌ర్ వ్యూవ్ విధానంలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయట‌. ఈ సినిమా థియేట్రిక‌ల్  రైట్స్ మ‌రియు నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ను జీ5 సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్ రాధే సినిమాకు అనుస‌రించిన విధానాన్నే జీ5 ఈ సినిమాకు కూడా అనుస‌రించాని భావిస్తోంట‌. ఇండియాలో పే ప‌ర్ వ్యూవ్ విధానంలో విడుద‌ల చేసి ఇత‌ర దేశాల్లో మాత్రం థియేట్రిక‌ల్ రిలీజ్ చేయాల‌ని జీ5 భావిస్తోంద‌ట‌. అంతే కాకుండా విడుద‌ల తేదీని ఎంపిక చేసే ప‌నిలో ఇప్పుడు జీ5 ఉంద‌ట‌. అన్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే ఈ సినిమాను మ‌రో రెండు నెల‌ల్లో పేప‌ర్ వ్యూ విధానంలో విడుద‌ల చేస్తార‌ని టాక్. అయితే ఇందులో ఎంత‌వ‌రకూ నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.  
 

More Related Stories