English   

త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్న సుక్కు విజ‌య్ సినిమా

Vijay Devarakonda
2021-06-03 11:59:04

రౌడీ హీరో విజయ్  క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది ఈ సినిమా ను అనౌన్స్ చేయగా ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. దాంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ రకరకాల వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఈ సినిమాపై నిర్మాణ సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ వివరణ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ఉంటుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం కరోనా విజృంభన నేపథ్యంలో షూటింగ్ ను వాయిదా వేసుకున్నాయి. ఇక ఈ సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకున్న తరవాత సుకుమార్ విజయ్ దేవర కొండ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నాడు. మరోవైపు సుకుమార్ కూడా పుష్ప తో పాన్ ఇండియా డైరెక్టర్ గా పరిచయం అవ్వబోతున్నారు. ఈ రెండు సినిమాలు హిట్ అయితే సుక్కు విజయ్ కాంబో క్రేజ్ భారీగా పెరగనుంది.

More Related Stories