English   

నిఖిల్ సిద్ధార్థ్ కు షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీస్

Nikhil Siddharth
2021-06-03 12:36:17

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. నిఖిల్ కారుకు పోలీసులు చలాన్లు వేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంగిస్తూ కర్ఫ్యూ సమయంలో భయటకు రావడం తో చలాన్లు విధించారు. అంతే కాకుండా నిఖిల్ కార్ నంబర్ ప్లేట్ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉండటం తో మరో చలాన్ వేశారు. ఇదిలా ఉండగా ఇటీవలే నికిల్ తాను మెడిసిన్ కోసం భయటకు వెలితే పోలీసులు నిలదీశారని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు మళ్లీ నిఖిల్ కారుకు చాలాన్లు వేసి పోలీసులు షాక్ ఇచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే నిఖిల్ ప్రస్తుతం 18 పేజీస్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే మరియు స్టోరీని అందిస్తున్నారు. అంతే కాకుండా కార్తికేయ 2 సినిమా షూటింగ్ ను ఇప్పటికే ప్రారంభించగా లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. ఈ సినిమా కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుస్తోంది. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయ సూపర్ హిట్ కావడం తో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

More Related Stories