English   

హైద‌రాబాదీతో ప్రేమ‌లో అడ‌వి శేషు

Adivi Sesh
2021-06-03 17:18:58

టాలీవుడ్ లో డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరో అడ‌విశేష్. ముక్యంగా సస్పెన్స్ థ్రిల్ల‌ర్లతో అడ‌వి శేష్ హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. కేవ‌లం శేష్ హీరోగానే కాకుండా డైరెక్ట‌ర్ గా కూడా త‌న టాలెంట్ ను నిరూపించుకున్నారు. ప్ర‌స్తుతం 'మేజర్‌', 'హిట్ 2 లాంటి సినిమాల్లో అడ‌వి శేష్ హీరోగా నటిస్తున్నారు. మేజ‌ర్ సినిమా టీజ‌ర్ ను ఇటీవ‌ల విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా టీజ‌ర్ ను మ‌హేష్ బాబు చేతుల మీదుగా విడుద‌ల చేశారు. 

ఇక‌ తాజాగా ఈ యంగ్ హీరో ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని భ‌య‌ట‌పెట్టారు. అదేంటంటే అడ‌వి శేష్ ఓ అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ్డార‌ట‌. ఈ విష‌యాన్ని టాలెంటెడ్ హీరో ఓ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో వెల్ల‌డించారు. అంతే కాకుండా ఆ అమ్మాయి హైద‌రాబాది అని అడ‌వి శేష్ పేర్కొన్నారు. అయితే  ఆ అమ్మాయి గురించి పూర్తి వివ‌రాలు భ‌య‌ట‌పెట్టేందుకు తాను ప‌ర్మిష‌న్ తీసుకోలేద‌ని ఆమె ప‌ర్మిష‌న్ ఇవ్వ‌గానే పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డిస్తాన‌ని శేష్ స్ప‌ష్టం చేశారు. అడ‌వి శేష్ ప్రేయ‌సి గురించి భ‌య‌ట‌పెట్ట‌గానే అత‌డిని ప్రేమ‌లో ప‌డేసిన ఆ ముద్దుగుమ్మ ఎవ‌రా అని ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. 
 

More Related Stories