English   

ఆగష్టులో నితిన్‌ వక్కంతం వంశీ మూవీ లాంచ్

 Nithiin
2021-06-04 09:43:28

నితిన్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగష్టు నెలలో లాంచ్ చేయనున్నారట దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. వక్కంతం వంశీ మొదటి సినిమా ‘నా పేరు సూర్య’ చిత్రం అనుకున్నంతగా అలరించలేదు. ఆ సినిమా తర్వాత వంశీ డైరెక్ట్ చేయనున్న సినిమా ఇదే. మొదటి చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వక్కంతం వంశీ కసిగా ఈ సినిమా కథను తయారు చేసుకున్నారట. లాంగ్ గ్యాప్ తీసుకుని పర్ఫెక్ట్ కథను సిద్ధం చేసుకుని నితిన్ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనుందో.. నితిన్ ప్రస్తుతం ‘అంధాధూన్’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఆ మధ్య విడుదలూ ఫస్ట్ లుక్ కూడ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. 

More Related Stories