English   

బెల్లంకొండ నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టం

Chatrapathi
2021-06-04 16:55:00

అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్.ఈ సినిమా మంచి విజయం సాధించడం తో బెల్లంకొండ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి శ్రీనివాస్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ కు పరిచయం అవ్వబోతున్నారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమా హిందీ రీమేక్ తో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాకు ఛత్రపతికి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ కు తగినట్టుగా కొన్ని మార్పులు చేసి స్టోరీ ఇవ్వనున్నారు. వివి వినాయక్.దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాను డాక్టర్ జయంతి లాల్ గడ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం ఆర్ట్స్ డైరెక్టర్ సునీల్ బాబు దాదాపు రూ.3 కోట్లతో ఆరు ఎకరాల్లో భారీ సెట్ వేశారు. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభించాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా సెట్ పూర్తిగా నాశనం అయ్యింది. దాంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లింది.

More Related Stories