English   

మొక్క నాటి నాకు షేర్ చేయండి.. నేను పోస్ట్ చేస్తా..బన్నీ

 Allu Arjun
2021-06-05 14:44:42

నేడు జూన్ 5 అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలని పోస్ట్ లు పెడుతున్నారు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక అడుగు ముందుకు వేసి మొక్కను నాటారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా బన్నీ "ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మనందరం మరిన్ని మొక్కలు నాటాలని తీర్మానం చేసుకుందాం. పర్యావరణ హితమైన అలవాట్లను అలవాటు చేసుకుందాం. మనకు ఈ ప్రకృతి చేస్తున్న దాన్ని అభినందిద్దాం. మన ప్లానెట్ ను పచ్చగా మారుద్దాం. మన తరవాత తరాలకు పచ్చదనాన్ని అందిద్దాం. అంటూ పేర్కొన్నారు. అంతే కాకుండా అల్లు అర్జున్ ఈ సందర్భంగా ఓ మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. " ప్రతి ఒక్కరినీ ఇప్పుడు అడుగితున్నా..మీరు మొక్క నాటి ఆ ఫోటోను నాకు షేర్ చేయండి. వాటిలో కొన్ని ఫోటోలను నేను పోస్ట్ చేసాను. మన ప్రకృతిని కాపాడుకునేందుకు కలిసి పని చేద్దాం రండి. అంటూ నెటిజెన్ లకు ఆఫర్ ఇచ్చారు. ఇక బన్నీ పిలునిచ్చిన ఈ కార్యక్రమంలో ఎంతమంది భాగస్వాములు అవుతారో చూడాలి.

More Related Stories