English   

మ‌గ బిడ్డ‌కు జన్మ‌నిచ్చిన ప్రభాస్ హీరోయిన్

Richa Gangopadhyay
2021-06-05 17:14:04

లీడ‌ర్ సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన బ్యూటీ రిచా గంగోపాద్యాయ్ మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని రిచా త‌న ఇన్స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించింది. త‌న‌కు మే27న మ‌గ‌బిడ్డ పుట్టాడ‌ని రిచా తెలిపింది. అంతే కాకుండా  అతడికి లుకా షాన్ అనే పేరును పెట్టిన‌ట్టు చెప్పింది. ప్ర‌స్తుతం అత‌డు ఎంతో ఆరోగ్యంగా అందంగా ఉన్నాడ‌ని తెలిపింది. అచ్చం త‌న నాన్న లాగే లుకా ఉన్నాడ‌ని చెప్పింది. అంతే కాకుండా అత‌డి రాక‌తో తాము ఎంతో ఆనందంగా ఉన్నామ‌ని కుటుంబంలో సంతోషాన్ని నింపాడ‌ని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా రానా హీరోగా న‌టించిన లీడర్ సినిమాతో రిచా టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైంది.  ర‌వితేజ హీరోగా న‌టించిన మిర‌ప‌కాయ్ మ‌రియు ప్ర‌భాస్ హీరోగా న‌టించిన మిర్చి సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివ‌ర‌గా రిచా నాగార్జున హీరోగా న‌టించిన భాయ్ సినిమాలో న‌టించింది. అయితే సినిమాల‌కు స‌డెన్ గా దూరమైన రిచా చ‌దువుకునేందుకు అమెరికా వెళ్లింది. అక్క‌డే జోను అనే అమెరిక‌న్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి త‌ర‌వాత రిచా సినిమాల‌కు పూర్తిగా దూర‌మైంది. 

More Related Stories