English   

ఎమ్మెల్యేకు మెగాస్టార్ ఫోన్..కార‌ణం ఇదే

chiranjeevi
2021-06-05 17:22:45

మెగాస్టార్ చిరంజీవి క‌రోనా బాధితుల కోసం ఇటీవ‌ల ఏపీ తెలంగాణ‌లోని జిల్లాల్లో ఆక్సీజ‌న్ బ్యాంక్ ల‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిందే. ఈ ఆక్సిజ‌న్ బ్యాంక్ ల ద్వారా మెగాస్టార్ అవ‌స‌ర‌మైన వారికి ఆక్సీజ‌న్ ను  అందిస్తున్నారు. అయితే తాజాగా ఇదే విష‌య‌మై చిరు మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయక్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విష‌యాన్ని ఎమ్మెల్యే తెలిపారు. మెగాస్టార్ ఫోన్ చేసి హలో.. శంకర్‌ ఎలా ఉన్నారు, కుటుంబసభ్యులు బాగున్నా రా.. ప్రజల్లో బాగా తిరుగుతారు. పరిస్థితులు బాగాలేవు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మానుకోట నా అభిమాన కోట శంకర్, మీ మాట కోసం జిల్లాకు ఆక్సిజన్‌ బ్యాంక్‌ ఇచ్చాను’ అంటూ మాట్లాడిన‌ట్టు శంక‌ర్ నాయ‌క్ వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా తాను ఆక్సీజ‌న్ బ్యాంకు ఏర్పాటు చేసినందుకు చిరంజీవికి ప్ర‌జ‌ల త‌ర‌పున కృత‌జ్ఞ‌త‌లు తెలిపాన‌ని శంక‌ర్ నాయ‌క్ పేర్కొన్నారు. 

More Related Stories