English   

ఆదిపురుష్ కోసం ప్ర‌భాస్ క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్

 Prabhas
2021-06-05 17:38:27

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన‌వ‌స‌రం లేదు. టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్న ప్ర‌భాస్ బాహుబ‌లితో దేశ వ్యాప్తంగా క్రేజ్ ను సంపాధించుకున్నాడు. అన్ని భాష‌ల్లో అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. అంతే కాకుండా బాహుబ‌లి త‌ర‌వాత ప్ర‌భాస్ చేస్తున్న సినిమాల‌న్నీ పాన్ ఇండియా చిత్రాలే. అయితే త‌న క్రేజ్ ను బ‌ట్టి ప్ర‌భాస్ రెమ్యునేష‌న్ ను కూడా భారీగానే వ‌సూలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న ఆది పురుష్ సినిమా రెమ్యున‌రేష‌న్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

ఈ సినిమా కోసం నిర్మాణ సంస్థ టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ ప్రభాస్‌కు రూ. 50 కోట్లను పారితోషికంగా ఇస్తున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ప్ర‌భాస్ క్రేజ్ ను దృష్టిలో ఉంచ‌కుని చూస్తే అంత‌ రెమ్యున‌రేష‌న్ పుచ్చుకోవ‌చ్చు. ఎందుకంటే బాలీవుడ్ న‌టులు సినిమా కోసం రెమ్య‌న‌రేష‌న్ తో పాటు సినిమా లాభాల్లో వాటాలు కూడా అడుగుతారు. కాబ‌ట్టి అన్నిఇండస్ట్రీల‌లో క్రేజ్ ఉన్న ప్ర‌భాస్ కు అంత ఇవ్వొచ్చ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా  పౌరానిక నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా వాయిదాప‌డ్డ ఈ సినిమా షూటింగ్ ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి రాగానే మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. 

More Related Stories