English   

పిసినారి పాత్రలో రాజేంద్రప్రసాద్ 

Rajendra Prasa
2021-06-07 09:46:39

వెంకీ, వరుణ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్‍లో వస్తున్న మూవీ  ఎఫ్ 3.  అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ఎఫ్ 3 సినిమా.. ఈ ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. ప్రస్తుతం ఈ సినిమా పనులు ఆగిపోయాయి. ఎఫ్3లో సినిమా కథ డబ్బు సంపాదన చుట్టూ తిరుగుతుందట. ఆ సందర్భంగా వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తాయని అంటున్నారు.  

ఎఫ్ 3 చిత్రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌ని పిసినారిగా చూపించి ఫ‌న్ అందించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. రాజేంద్ర ప్ర‌సాద్ పాత్ర సినిమాకే హైలైట్‌గా ఉంటుంద‌ని టాక్. క‌రోనా సెకండ్ వేవ్ వ‌ల‌న ఆగిన చిత్ర షూటింగ్ మ‌రి కొద్ది రోజుల‌లో సార‌ధి స్టూడియోలో ప్రారంభం కానుంది. ఈ సీక్వెల్ లో కూడా త‌మ‌న్నా, మెహ‌రీన్‌లే క‌థానాయిక‌లుగా న‌టించబోతున్నారు. వీళ్ళు వెంకీ వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. మొత్తానికి భార్యల టార్చరే ఎఫ్ 3 కథకు మెయిన్ మోటివ్ అని సమాచారం.

More Related Stories