English   

బాలయ్య సినిమాలో  విలన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్

balakrishna
2021-06-07 10:25:16

వరలక్ష్మీ శరత్ కుమార్ మొరటుతనం ఉన్న విలనీతో విశాల్ పందెంకోడి, క్రాక్ సినిమాలో మెప్పించింది. మరోసారి అలాంటి పాత్రలో సర్ ప్రైజ్ చేయబోతుందట. . బోయపాటితో అఖండ తర్వాత  బాలయ్య అనీల్ రావిపూడితోనూ సినిమా చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా పనులు వేగంగా సాగుతున్నాయని తెలిసింది. ఈ మూవీలో వరలక్ష్మీ  చేసే అవకాశం ఉందని గుసగుసలు మొదలయ్యాయి. బాలయ్య సినిమాలో తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కి ఆఫర్ దక్కిందట.  అనీల్ రావిపూడి ఆమె కోసం ఓ పవర్ ఫుల్ పాత్ర రాస్తున్నాడట.  బాలయ్యతో ఆమె ఢీ కొట్టే సన్నివేశాలు అభిమానులకు సర్ ప్రైజ్ చేస్తాయట.  మరోవైపు బాలయ్య అభిమానులు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ‘అఖండ’రిలీజ్ కోసం వేయి కళ్లతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

More Related Stories