English   

కరోనా బిల్లులుపై హీరో నిఖిల్ ఫైర్

 actor nikhil
2021-06-07 16:32:19

కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో బెడ్లు సమకూరుస్తూ, అవసరమైన ఔషధాలు అందిస్తూ, ఆక్సిజన్‌ సిలిండర్లు పంపిస్తూ ప్రాణదాతగా మారాడు హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌. కానీ తానింత కష్టపడినా కళ్ల ముందే కొందరు పిట్టల్లా రాలిపోతుంటే తట్టుకోలేకపోయాడు. మరోవైపు ఆస్పత్రులు దొరికిందే ఛాన్స్‌ అన్నట్లుగా రోగుల కుటుంబాల దగ్గర నుంచి అందినకాడికి దోచుకోవడం చూసి ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

"నా దృష్టికి వచ్చిన ఎన్నో ఆస్పత్రులు పేషెంట్లకు పది లక్షలకు పైగా బిల్లులు వేస్తున్నాయి. ఆ ఫీజు చెల్లించేందుకు మేము కొంతమంది బాధితులకు చేతనైనంత సాయం చేస్తున్నాం. కానీ చిన్నపాటి సర్జరీలకు కూడా ఎందుకింత ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నారు? దీన్ని ఎవరు నియంత్రిస్తారు?' అని ఆవేదన చెందాడు. 'ఒక్కరోజు ఆస్పత్రి బెడ్‌ దొరకాలన్నా రూ.30 వేల దాకా వసూలు చేస్తున్నారు' అని ఓ నెటిజన్‌ ఫిర్యాదు చేయగా 'ఎందుకు? బెడ్‌ బంగారంతో తయారు చేశారా?' అని ఆస్పత్రి మీద సెటైర్లు వేశాడు హీరో నిఖిల్‌.

More Related Stories