English   

నంద‌మూరి అభిమానుల‌కు బాల‌య్య‌ విజ్ఞ‌ప్తి

Nandamuri Balakrishna
2021-06-07 17:09:09

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌క్రిష్ణ త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉంటున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా కేసులు వేగంగా పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బ‌ర్త్ డే వేడుక‌లకు దూరంగా ఉండాల‌ని బాల‌య్య డిసైడ్ అయ్యారు. దాంతో అభిమానులు ఎవ‌రూ రాకూడ‌ద‌ని రిక్వెస్ట్ చేస్తూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అందులో....నా ప్రాణ సమానులైన  అభిమానులకు తెలియ‌జేయునిది ఏమ‌న‌గా...ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు నన్ను కలిసేందుకు నలు దిక్కుల నుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని. కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు. నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమాన..ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక. దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ .ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ మీ నందమూరి బాలకృష్ణ . అని బాల‌క్రిష్ణ తెలిపారు. 

More Related Stories