English   

సమంత ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో వార్తలు

Samantha
2021-06-07 18:04:17

టాలీవుడ్ భామల్లో సమంతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందం అభినయంతో ఆకట్టుకునే సామ్ అంటే ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ఇక ఏమ్మాయ చేసావే సినిమాతో తెలుగు వారికి పరిచయమైన సమంత ఆ తరవాత నాగ చైతన్యకు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. 2017 లో వీరి విహహం జరగ్గా అప్పటి నుండి సామ్ ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అంతే కాకుండా అక్కినేని వారసులు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నారు. 

కాగా తాజాగా సామ్ గుడ్ న్యూస్ చెప్పబోతుందంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమంత తల్లి కాబోతుందని త్వరలోనే ఈ విషయాన్ని భయటపెడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు వినిపించడానికి ఒక కారణం కూడా ఉంది. సమంత తాజాగా ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఫోటో షూట్ చేసింది. అయితే ఆ ఫోటోల్లో సమంత కంటే చెట్టుకున్న కచ్ఛ మామిడికాయ ను హైలెట్ చేశారు. కాగా ప్రస్తుతం సమంత ప్రెగ్నెంట్ అని త్వరలోనే తల్లికాబోతుందని గుసగుసలు మొదలయ్యాయి. ఇక ఇవి ఎంతవరకు నిజమో తెలియాలంటే సామ్ నోరు విప్పాల్సిందే.

More Related Stories