English   

కళ్యాణ్ రామ్ బింబిసారకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

Kalyan Ram
2021-06-08 12:11:01

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బింబిసార అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నగారు ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ చూసిన అభిమానులు సర్ప్రైజ్ అయ్యారు. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ బాహుబలి, మగధీర రేంజ్ లో ఉండటం తో నందమూరి అభిమానులు ఖుషీ అయ్యారు. ఈ సినిమాను తెలుగు తో పాటు ఇతర భాషల్లోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ సపోర్ట్ తో సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు వశిష్ఠ మల్లిడి అనే నూతన దర్శకుడు డైరెక్షన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 

More Related Stories