English   

నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టు షాక్ 

Amravati
2021-06-08 17:27:56

ఎంపీ నవనీత్ కౌర్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆమె ఎస్సీ కేటగిరికి చెందిన మహిళ కాదని, కులధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేసింది. దీంతోపాటు రూ.2 లక్షల జరిమానా విధించింది.అయితే ఈ కారణంగా ఆమె ఎంపీ పదవికి గండం ఏర్పడే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సర్టిఫికెట్లు సరైనవే అని నిర్ధారించుకునేందుకు కోర్టు నవనీత్ కౌర్‌కు నెల రోజుల సమయం ఇచ్చింది.  ఒకవేళ ఆమె నెలలోపు ఈ విషయాన్ని నిరూపించలేకపోతే లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కోర్టు విధించిన జరిమానా మొత్తాన్ని మహారాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పుపై ఎంపీ నవనీత్ కౌర్ స్పందించారు. కోర్టు తీర్పును తాను గౌరవిస్తానని అన్నారు. దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళతానని అన్నారు. అక్కడ తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు.

More Related Stories