English   

తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగింపు

Telangana
2021-06-08 20:43:57

తెలంగాణలో లాక్‌డౌన్‌ మరో పదిరోజుల పాటు పొడిగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడిలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లినవారు తిరిగి ఇంటికి చేరుకోవడానికి మరో గంటపాటు అంటే సాయంత్రం 6 గంటల వరకు సమయమిస్తారు. ఆ తర్వాత నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని పోలీసు శాఖను కేబినెట్ ఆదేశించింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాని.. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో మాత్రం, లాక్‌డౌన్‌ ఇప్పుడు కొనసాగుతున్న యదాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.

More Related Stories