English   

మహేష్ బాబుకు జోడిగా విజయ్ హీరోయిన్

Malavika Mohanan
2021-06-09 15:06:12

ప్ర‌స్తుతం సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సినిమాలో మ‌హేష్ బాబుకు హీరోయిన్ గా కీర్తి సురేష్ న‌టిస్తోంది. క‌రోనా కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా వ‌డింది. ఇదిలా ఉండ‌గానే మ‌హేశ్ బాబు మ‌రో సినిమాను లైన్లో పెట్టారు. ఈ సినిమా త‌ర‌వాత త్రివిక్ర‌మ్ తో ఓ సినిమా చేసేందుకు మ‌హేశ్ బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. 

కాగా తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో మాస్ట‌ర్ సినిమాలో విజ‌య్ కి జోడీగా న‌టించిన మాళ‌విక మోహ‌న్ హీరోయిన్ గా న‌టించ‌బోతుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. మాళ‌విక మ‌హేశ్ బాబుకు సూట్ అవుతుంద‌ని త్రివిక్ర‌మ్ భావిస్తున్నారట‌. అందుకే ఆమెను తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇదిలా ఉండ‌గా మాళ‌విక ఇప్ప‌టికే విజయ్ దేవ‌ర‌కొండ ప‌క్క‌న ఓ తెలుగు సినిమాలో న‌టించాల్సి ఉంది కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇక ఇప్పుడు అన్నీ కుదిరితే మ‌హేశ్ బాబు ప‌క్క‌న న‌టించే అవ‌కాశం ఉంది. మొద‌ట మ‌ల‌యాళం  సినిమాల‌తో ఎంట్రీ ఇచ్చిన మాళ‌విక ఆచి తూచి సినిమాలు చేస్తోంది. మాస్ట‌ర్ సినిమా విజ‌యం త‌ర‌వాత ఈ అమ్మ‌డికి ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. 

More Related Stories