English   

స‌మంత వెబ్ సిరీస్ పై భార‌తీరాజా ఫైర్

Bharathiraja
2021-06-09 15:12:16

అక్కినేని కోడ‌లు స‌మంత చేసిన వెబ్ సిరీస్ ఫ్యామిలీమ్యాన్ 2 పై ఓ వైపు ప్ర‌శంస‌లు కురుస్తుంటే మ‌రోవైపు విమర్శలు  కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఫ్యామిలీ మ్యాన్-2 పై మొద‌టి నుండి విమర్శలు వ‌స్తున్నాయి. ఈ సిరీస్ త‌మిళుల‌ను కించ‌ప‌రిచేలా ఉందని...త‌మిళ జాతికి వ్య‌తిక‌రేఖంగా దీన్ని తెర‌కెక్కించారని ట్రైల‌ర్ విడుద‌లైన నాటి నుండి కొంత మంది త‌మిళులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ సమంత శ్రీలంకకు చెందిన త‌మిళ యువ‌తి పాత్ర‌లో న‌టిచ‌డంతో ఆమె పాత్ర‌పై కూడా విమ‌ర్శలు వ‌స్తున్నాయి. 

కాగా తాజాగా ఈ వెబ్ సిరీస్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ద‌ర్శ‌కుడు భారతీ రాజా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసారు. ఈ ప్ర‌క‌ట‌న‌లో త‌మిళ ద్రోహులే ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారని ఫైర్ అయ్యారు. అంతే కాకుండా ఈ వెబ్ సిరీస్ ను ప్రసారం చేయ‌వ‌ద్ద‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేసినా ప్ర‌సారం చేయడం బాధాక‌ర‌మ‌ని అన్నారు. ఇప్ప‌టికైనా కేంద్రం స్పందించి వెబ్ సిరీస్ ను నిషేదించాల‌ని డిమాండ్ చేశారు. వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ను ఆప‌కుంటే ప్ర‌సార సంస్థ అమెజాన్ పై పోరాటానికి కూడా సిద్ధ‌మ‌ని భార‌తీరాజా పేర్కొన్నారు. 

More Related Stories