English   

బాబాయ్ బర్త్ డే..అబ్బాయిల స్పెషల్ విషెస్

Jr NTR birthday
2021-06-10 14:09:38

నటసింహం నందమూరి బాలయ్య ఈరోజు 61వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రతియేడాది అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య బర్త్ డే వేడుకలు జరుపుకునే బాలయ్య ఈ ఏడాది కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాను పుట్టినరోజును జరుపుకోవడం లేదని అభిమానులు ఎవరూ రావొద్దని బాలయ్య కోరారు. ఒక్క అభిమాని దూరమైనా తాను భరించలేనని చెప్పారు. ఇక బాలయ్య బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నప్పటికీ ఉదయం నుండి సోషల్ మీడియాలో బర్త్ డే సందడి నెలకొంది. అభిమానులు, సెలబ్రెటీలు బాలకృష్ణకు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుతున్నారు. 

ఇప్పటికే అబ్బాయిలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈమేరకు వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. పోస్ట్ లో ఎన్టీఆర్ " బాబాయ్ కి 61వ పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరు ఇలాగా ఆయురారోగ్యాలతో కలకాలం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నా" అంటూ పేర్కొన్నారు. కళ్యాణ్ రామ్ తన పోస్ట్ లో " 61వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా..హ్యాపీ బర్త్ డే బాబాయ్" అంటూ పేర్కొన్నారు.

More Related Stories