English   

ఆట సందీప్ దంపతులకు మెగాస్టార్ వాయిస్ మెసేజ్

 Chiranjeevi
2021-06-11 16:02:18

ఆట డ్యాన్స్ షో తో గుర్తింపు తెచ్చుకున్న కొరియోగ్రాఫ‌ర్ ఆట సందీప్-జ్యోతి రాజ్ దంప‌తుల‌కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ మెసేజ్ పంపించారు. మెగాస్టార్ సీసీసీ ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో ఆట సందీప్ ఆయ‌న త‌ల్లికి వ్యాక్సిన్ వేయించారు. ఈ సంధ‌ర్భంగా సందీప్ మెగాస్టార్ కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ మెసేజ్ పెట్టారు. కాగా ఆ మెసేజ్ ను చూసుకున్న మెగాస్టార్ తిరిగి ఆట సందీప్ కు వాయిస్ మెసేజ్ పంపించారు.  ఆ వాయిస్ మెసేజ్ ను సందీప్ త‌న ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. 

వాయిస్ మెసేజ్ లో చిరు... 'మీ థ్యాంక్యూ మెసేజ్‌ నాకు అందింది. ముఖ్యంగా అమ్మగారికి కూడా వేయించారు క‌దా. అమ్మ మాటలు, ఆమె దీవెనలు నాకు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. మీరిద్ద‌రు చేసే డ్యాన్స్‌ బిట్స్‌ అప్పుడప్పుడు నా దృష్టికి వస్తుంటాయి. మీ కపుల్స్‌ చాలా లవ్లీ డ్యాన్సర్స్‌. మీ క్రేజ్‌ నన్ను బాగా ఆకటుకుంటుంది. భవిష్యత్తులో మీరు ఇంకా పెద్ద కొరియోగ్రాఫర్‌గా రాణించాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ సందీప్ దంప‌తుల‌కు వాయిస్ మెసేజ్ పంపించారు. ఇదిలా ఉండ‌గా ఆట సందీప్ ప్ర‌స్తుతం ప‌లు టీవీ షోలు చేస్తూ సినిమాల‌కు కూడా కొరియెగ్రాఫ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతే కాకుండా సందీప్ దంప‌తుల‌కు ఇన్స్టాగ్రామ్ లో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వాళ్లు చేసే డ్యాన్సులు అంటే పడిచ‌చ్చేవారు ఎంతో మంది ఉన్నారు. ఇక ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ కూడా వారి డ్యాన్స్ ల‌కు ఫిదా అయ్యారు.  

More Related Stories