English   

పెట్ డాగ్స్ తో సంద‌డి చేస్తోన్న ముద్దుగుమ్మ‌లు

Charmme Kaur
2021-06-14 15:14:18

టాలీవుడ్ లో చాలా మంది నటీనటులు జంతు ప్రేమికులే ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ బుజ్జి బుజ్జి కుక్కలతో, పిల్లులతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటారు. అలాంటి పెట్ లవర్స్ లో నటి చార్మి కూడా ఒకరు. చార్మి వద్ద చాలా పెట్స్ ఉన్నాయి. రకరకాల జాతులకు చెందిన శునకాలు ఉన్నాయి. వాటితో ఎప్పుడూ సరదాగా గడుపుతూ ఛార్మి ఆ ఫోటోలు షేర్ చేస్తు ఉంటారు. ఇక ఛార్మీ తో పాటు యంగ్ హీరోయిన్ రష్మిక కు కూడా పెట్స్ అంటే చాలా ఇష్టం. ఆమె వద్ద కూడా ఒక బుజ్జి కుక్క పిల్ల ఉంది. దాన్ని రష్మిక ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. 

కాగా తాజాగా ఛార్మి మరియు రష్మిక ఇద్దరూ ఒకచోట ముంబైలో కలిశారు. ఈ సందర్భంగా రష్మిక తన కుక్క పిల్లలు కూడా వెంట తీసుకెళ్ళింది. అంతే కాకుండా ఇద్దరు తమ కుక్క పిల్లలను ఒక దాని ముందు ఒకటి ఉంచగా మొదట భయపడినా ఆ తర్వాత కలిసిపోయాయి. ఈ సందర్భంగా వారు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఫ్రెండ్ అవుతున్నాయి. దాంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. క్యూట్ పప్పిస్ తో హాట్ బేబీస్ అని కామెంట్ చేస్తుండగా...మరికొందరు కుక్కపిల్లతో టాలీవుడ్ ముద్దుగుమ్మలు అని కామెంట్ పెడుతున్నారు.

More Related Stories