English   

దిల్ రాజు త‌మిళ హీరోకు భారీగానే ఇస్తున్నాడుగా

Dil Raju
2021-06-14 16:33:45

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అంతేకాకుండా దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. దాదాపు ఈ సినిమాకు దిల్ రాజు 180  నుండి 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మరో వైపు ఈ సినిమాకు హీరో విజయ్ భారీ రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా కోసం ఏకంగా విజయ్ 100 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారట. ఇప్పటికే 10 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చారట.  బిజినెస్ సమయంలో 100 కోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారట. ఇదిలా ఉండగానే సినిమా సూపర్ హిట్ విజయ్ కి లాభాల్లో వాటా కూడా ఇవ్వానున్నరట. ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఇక్కడ వసూళ్లు రాకపోయినా తమిళనాట మాత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసేలా వసూళ్లు వస్తాయి. అందువల్లే దిల్ రాజు భారీ మొత్తం ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

More Related Stories