English   

తప్పు ఉంటే బేషర‌తుగా క్ష‌మాప‌ణ చెబుతా..హైప‌ర్ ఆది

Hyper Aadi
2021-06-15 17:04:02

హైపర్‌ ఆది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచాడు.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ తెలంగాణ జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ యాస, భాషలను కించపరిచే విధంగా మాట్లాడారని తెలంగాణ జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆరోపించింది. ఈ మేరకు ఆది, స్క్రిప్ట్‌ రైటర్‌తో పాటు మల్లెమాల ప్రొడక్షన్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్‌బీ నగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హైపర్‌ ఆది దీనిపై స్పందిస్తూ..

‘స్టేజ్‌పై దాదాపు 20 వరకూ ఉన్నారు.. ఎవరు ఏం పాడుతున్నారో కూడా తెలుసుకునే అవకాశం అక్కడ లేదు. ఎవరి పాట వాళ్లు పాడుకున్నారు. స్టేజ్ మీద ఏం జరుగుతుందో అంతమందిలో తెలియలేదు. బతుకమ్మ అని ఎవరు అంటున్నారో తెలియదు.. గౌరమ్మ అని ఎవరు అంటున్నారో తెలియదు. ఒకవేళ నేను అన్నదాంట్లో నిజంగా తప్పు ఉంటే మాత్రం. క్షమించమని అడగడానికి నాకేం ప్రాబ్లమ్ లేదు.. ఆ ఫ్లోలో జరిగిన మిస్టేక్ ఏదైనా ఉంటే.. తెలంగాణ వాళ్లకి భేషరతుగా క్షమాపణ చెప్తా’ అని అన్నారు హైపర్ ఆది.

More Related Stories