English   

రాధే శ్యామ్ సీక్రెట్స్ బయటపెట్టిన ప్రియదర్శి

priyadarshi
2021-06-16 15:44:25

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నటుడు ప్రియదర్శి. ప్రస్తుతం దర్శి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. పెళ్లి చూపులు సినిమా లో కమెడియన్ నటించిన ప్రియదర్శి ఆ తర్వాత చాలా సినిమాల్లో కామెడీ రోల్స్ చేశారు. కానీ ఈ మధ్య ప్రియదర్శిని డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అంతే కాకుండా తనలోని నటుడిని ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 

ఇలా ఉండగా ప్రియదర్శి ప్రభాస్ హీరోగా  నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి తన పాత్ర గురించి దర్శి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో ప్రియదర్శి పాత్ర పూర్తిగా నవ్వులు పూయించే విధంగా ఉంటుందట. అంతేకాకుండా పూజా హెడ్గే ను ఇంప్రెస్ చేసే పాత్రలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కు ప్రియదర్శికి మధ్య జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా ఈ సినిమా ఒక గొప్ప చిత్రంగా నిలుస్తుందని ప్రియదర్శి చెబుతున్నారు.  గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను రాధే శ్యామ్ ఇస్తుందన్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి జిల్ సినిమా దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

More Related Stories