English   

వరుణ్ తేజ్ చేతికి చరణ్ సినిమా

Venky Kudumula
2021-06-17 11:37:40

ఇండస్ట్రీలో ఒకరికోసం సిద్ధం చేసిన కథలు మరొకరి దగ్గరికి వెళ్లడం సహజమే. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ చరణ్ కోసం సిద్ధం చేసిన కథ వరుణ్ తేజ్ వద్దకు వెళ్ళింది. చలో, భీష్మ లాంటి వరుస హిట్లు అందుకున్న వెంకీ కుడుముల తన తదుపరి సినిమా రామ్ చరణ్ తో ప్లాన్ చేశారు. అంతేకాకుండా చరణ్ కు వెంకీ కొన్ని కథలు కూడా వినిపించారు. అయితే చరణ్ కు ప్రస్తుతం భారీ ఆఫర్ లు రావడం వెంకీ తన కథలతో ఇంప్రెస్ చేయలేకపోవడంతో సున్నితంగా తిరస్కరించారు. అయితే ఇప్పుడు వెంకీ అదే కథతో వరుణ్ తేజ్ ను సంప్రదించారు. 

వరుణ్ తేజ్ కు కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో వెంకీ ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ ను సిద్దం చేసే పనిలో ఉన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వరుణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తవ్వగానే వెంకీ కుడుముల తో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా "గని" అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో  వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నారు.

More Related Stories