English   

టాలీవుడ్ లో మ‌రోవిషాదం..న‌టుడి భార్య మృతి

uma rani
2021-06-17 13:54:03

టాలీవుడ్ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా వల్ల ఇప్ప‌టికే ఎంతో మంది నటీనటులను మరియు వారి బంధువులను కోల్పోవ‌డం వ‌ల్ల చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది. కాగా తాజాగా మరొక నటుడు టార్జాన్ లక్ష్మీనారాయణ ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న భార్య ఉమారాణి (52) గుండెపోటుతో కన్నుమూశారు.  గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉమారాణి ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో మరణించారు. టార్జాన్ లక్ష్మీనారాయణ కు ఇద్దరు భార్యలు పెద్ద భార్య  ఉమారాణి కి సంతానం లేకపోవడంతో లక్ష్మీనారాయణ రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉండ‌గా లక్ష్మీనారాయణ తెలుగు పరిశ్రమలో ప‌లువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రల‌లో లక్ష్మీనారాయణకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

More Related Stories