English   

తెలంగాణ టాప్ ఈతగాళ్ల లిస్ట్ లో గౌతమ్‌ ఘట్టమనేని

Gautam Ghattamaneni
2021-06-17 15:24:15

గౌతమ్‌ ఘట్టమనేని మహేశ్‌ హీరోగా నటించిన ‘1 నెకొక్కడినే’లో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌గా, ఇందులో గౌత‌మ్ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి . మ‌రోసారి త‌న త‌ల్లిదండ్రులు గ‌ర్వ‌ప‌డేలా చేశాడు గౌత‌మ్. తాజాగా ఆయన సాధించిన ఓ ఘనతే దీనికి నిదర్శనం. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్‌ పోటీలో టాప్‌ 8 ఈతగాళ్ల లిస్ట్‌లో స్థానం సంపాదించాడు గౌతమ్‌. 15 ఏళ్ల వయసులోనే ఆయన ఈ ఘనత సాధించాడు. తన కొడుకు సాధించిన విజయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది మహేశ్‌ సతీమణి నమ్రత. గౌతమ్‌ నీళ్లలో 5 కిలో మీటర్ల దూరాన్ని 3 గంటల్లో ఈదగలడని చెప్పుకొచ్చింది. గౌతమ్‌ బటర్‌ఫ్లై, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్ , ఫ్రీస్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో ఈత కొడతాడని, అతనికి ఫ్రీస్టైల్ అంటే బాగా ఇష్టమని చెప్పింది. ఇక తమ అభిమాన హీరో కొడుకు స్విమ్మింగ్‌లో రికార్డు క్రియేట్‌ చేయడంతో.. మహేశ్‌ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు.

More Related Stories