English   

ఆ ప్రొడ్యూస‌ర్ న‌న్ను మోసం చేశారు..అదిరే అభి

adhire abhi
2021-06-18 12:03:33

ఈశ్వర్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచ‌య‌మైన న‌టుడు అదిరే అభి. ఆ తర్వాత ప‌లు సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసినా పెద్ద‌గా గుర్తింపు ద‌క్క‌లేదు. ఇక జబర్దస్త్ కామెడీ షో ద్వారా మాత్రం అభికి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత అభి ఎంతో మంది కమెడియన్ లను జబర్దస్త్ కు పరిచయం చేశాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా వెలిగిపోతున్న హైపర్ ఆదిని కూడా పరిచయం చేసింది అభి అన్న విషయం అందరికి తెలిసిందే. 

ఇదిలా ఉండ‌గా ఎప్పుడూ చ‌లాకీగా నవ్వుతూ న‌వ్విస్తూ కనిపించే   అభి జీవితంలో కొన్ని చేదు అనుభవాలు కూడా ఉన్నాయట. వాటిని అభి ఇటీవ‌ల‌ ఆలీతో జాలీగా అనే ప్రోగ్రాం భ‌య‌ట‌పెట్టాడు. ఎంతో ఎమెష‌న‌ల్ అయ్యాడు. అభి మాట్లాడుతూ...... నేను ఇండస్ట్రీకి వచ్చింది దర్శకుడు అవ్వాలని...ఓ సినిమాకు అసిస్టెంట్ గా ప‌నిచేసి ఆ అనుభవంతో ఒక కథ రాసుకున్నాను. ఆ కథను ప్రొడ్యూసర్ మ‌రియు హీరో హీరోయిన్లకు చెప్పి ఒప్పించాలని అనుకున్నాను. 

అయితే సినిమా అవ‌క‌వాశం కోసం వెళ్ల‌గా ఓ ప్రొడ్యూస‌ర్ ముందుగా త‌న‌నే ఐదు ల‌క్ష‌లు ఇవ్వాల‌ని కోరార‌ట‌. దాంతో మన సినిమా కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయిదు లక్షలు పెద్ద విషయమా అని ఇచ్చాను. ఆ తర్వాత  ప్రొడ్యూసర్ ఆ సినిమాను క్యాన్సిల్ చేశాడు.  అత‌డికి ఇచ్చిన ఐదు ల‌క్ష‌లు కూడా తిరిగి ఇవ్వ‌లేదు. దాంతో ఐదు ల‌క్ష‌ల కోసం ఎన్నో క‌ష్టాలు ఎదుర్కున్నాన‌ని చెప్పారు.

More Related Stories