English   

నాగార్జున మరో సాహసం...ఈ వయసులోనూ తగ్గేదేలే

Nagarjuna
2021-06-18 12:29:50

నాగార్జున అంటేనే టాలీవుడ్ కు మన్మథుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అయితే నాగ్ రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ మాస్ యాక్షన్ సినిమాలు కూడా చేస్తూనే వుంటారు. తనలో ఉన్న వైవిధ్యమైన నటుడిని తెలుగు పరిశ్రమకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాడు .అదే విధంగా ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఒక సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మాజీ రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఆఫీసర్ గా నటించనున్నాడు. అయితే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ప్రముఖ పాత్ర ఉన్నట్లుగా తెలుస్తుంది. వీటి కోసం నాగార్జున ఇజ్రాయిల్ యుద్ధ విద్యల్లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నట్లు  తెలుస్తోంది. 

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకే మొదలు కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల వాయిదా పడింది . ఇక ప్రస్తుతం ఇండియాలో కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో  వచ్చే నెల మొదటి వారం నుండి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించాలని చిత్రబృందం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే .కాజల్ కూడా సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. చందమామ కూడా రా ఏజెంట్ గానే మనకు కనిపించబోతుంది.  ఇక నాగార్జున సోగ్గాడే చిన్నినాయన తర్వాత దాదాపు ఐదు సంవత్సరాలపాటు అపజయాల తోనే  నెట్టుకుంటూ వస్తున్నాడు. మరి ఈసారైనా ప్రవీణ్ సత్తార్ నాగార్జునకు హిట్ ఇస్తాడేమో చూడాలి.

More Related Stories