English   

ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలివే

OTT
2021-06-18 14:44:25

కరోనా దెబ్బతో థియేటర్లపై చాలా ప్రభావం పడింది.  గత ఏడాది కాలంగా థియేటర్లు కంటిన్యూగా సినిమాలను రిలీజ్ చేసింది లేదు. కరోనా విజృంభణతో థియేటర్లు మూత పడటం...కాస్త కేసులు తగ్గగానే 50 శాతం షూటింగ్ పరిమితం చేయడం..కేసులు పెరిగితే  మళ్ళీ పూర్తిగా మూతపడటం ఇలానే జరుగుతూ వచ్చింది. దాంతో థియేటర్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. దేశంలోని  అన్ని పరిశ్రమలు నష్టపోయినప్పటికీ ఓటీటీ రంగానికి మాత్రం కాసుల పంట కురుస్తుంది. 

ఇక వారం వారం ఓటీటీ లు కొత్త సినిమాలను విడుదల చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వారం చాలానే సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.  అవేంటో ఇప్పుడు చూద్దాం....ఈ వారం అమెజాన్ ప్రైమ్ లో విద్యాబాలన్ కీలక పాత్రలో నటించిన షేర్ నీ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అంతేకాకుండా ఆహాలో  ప్రియదర్శి కీలక పాత్రలో నటించిన ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనే సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక నెట్ ఫిక్స్ లో జగమే తంత్రం, ఫాదర్ హుడ్, ఎలైట్ సీజన్ ఫోర్, ఎ ఫ్యామిలీ స్ట్రీమింగ్ కానున్నాయి. అంతే కాకుండా జియో సినిమాలో కమ్మరి సంభవం స్ట్రీమింగ్ కానుంది. ఇక స్పార్క్స్ ఓటీటీలో నోయల్ కీలక పాత్రలో నటించిన మనిషి స్ట్రీమింగ్ కానుంది.

More Related Stories