English   

నాకు ఇష్టమైన దర్శకుడు శేఖర్ తో పని చేసేందుకు ఎదురుచూస్తున్నా..ధనుష్

 Dhanush
2021-06-19 12:46:39

ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలతో మెప్పిస్తున్న ధనుష్, ‘జగమే తంత్రం’ మూవీతో నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ఈ సినిమా విడుదలైన రోజునే తన కొత్త సినిమా అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడం విశేషం. శేఖర్ కమ్ముల తాను ఇష్టపడే దర్శకుల్లో ఒకరని తమిళ స్టార్ హీరో ధనుష్ అన్నారు. ఆయనతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా అని చెప్పారు. శేఖర్ కమ్ములతో వర్కింగ్ ఎగ్జైటింగ్ గా ఉందని ట్వీట్ చేశారు. 

నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు గారి నిర్మాణంలో ఎస్వీసీ ఎల్ఎల్పీ సంస్థలో నటిచడం సంతోషంగా ఉందన్నారు ధనుష్. సినిమా ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నా అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ధనుష్ హీరోగా ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉన్నాయి. మరోవైపు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల తీసిన 'లవ్ స్టోరీ' రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి రెడీ అవుతోంది. దాంతో త్వరలోనే ఈ మూవీ సెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్లే అవకాశాలున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేసే ధనుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కేరాఫ్ అయిన శేఖర్ ఎలాంటి చిత్రం చేయబోతున్నాడో చూడాలి మరి.
 

More Related Stories