English   

చందమామ కు ఆచార్య టీమ్ సర్ప్రైజ్

Acharya
2021-06-19 13:35:58

టాలీవుడ్ బ్యూటీ అందాల చందమామ కాజల్ అగర్వాల్ నేడు పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న "ఆచార్య" చిత్ర యూనిట్ కాజల్ పోస్టర్ విడుదల చేసి సర్ ప్రైజ్ చేసింది. ఈ పోస్టుల్లో కాజల్ చాలా అందంగా కనిపిస్తోంది. పట్టు పరికిణీ లో అచ్చమైన తెలుగు అమ్మాయిలా అలరిస్తోంది. 

ఇదిలా ఉండగా ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తిరిగి హైదరాబాదులో ప్రారంభమైంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తిచేసి విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

More Related Stories