English   

మిల్కా సింగ్ మృతిపై మ‌హేష్‌, బాల‌య్య సంతాపం

Tollywood
2021-06-19 15:10:55

 ప్రముఖ అథ్లెట్, దిగ్గజ క్రీడాకారుడు, స్ప్రింటర్ మిల్కా సింగ్ (91) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ మిల్కా తుదిశ్వాస విడిచారు. గత మే నెల 20న మిల్కా సింగ్ కరోనా బారినపడ్డారు. ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలోకి తరలించారు. డిశ్చార్జి అయిన తర్వాత కూడా పలు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జూన్ 18 రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.ఆయ‌న మృతి దేశం మొత్తాన్ని విషాదంలో నింపింది. సినీ రాజకీయ సాధారణ ప్రజలంతా కూడా మిల్కా సింగ్ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

మిల్కా సింగ్ మ‌ర‌ణ వార్త చాలా హృద‌య విదార‌కం. స్వాతంత్ర్యం త‌ర్వాత ఎలా న‌డుచుకోవాలో చూపించారు. మీరు రాబోయే తరాల‌కు స్పూర్తి. మా హీరో మీరు. దేశం మిమ్మ‌ల్ని ఎప్పుడు గుర్తుంచుకుంటుంది. మీ జీవితం నుండి ఎంతో మంది ప్రేర‌ణ పొందుతారు అని బాల‌య్య త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇక టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్ లో సంతాపం తెలిపారు. మీ మ‌ర‌ణం నాకెంతో మ‌న‌స్థాపం క‌లిగించింది. మీ న‌ష్టం పూడ్చ‌లేనింది. మీరు అథ్లెట్స్‌కి స్పూర్తివంతంగా ఉంటారు అని మ‌హేష్ స్ప‌ష్టం చేశారు.

More Related Stories