English   

ఖిలాడి యాక్షన్ సీన్..సోషల్ మీడియాలో వైరల్  

Ravi Teja
2021-06-19 15:53:28

మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఖిలాడి'. 'ఖిలాడి' ఇటలీ షెడ్యూల్ లో షూట్ చేసిన యాక్షన్ సీన్ కు సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్ ను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిత్ర యూనిట్ కరోనా సెకండ్ వేవ్ ప్రభావానికి ముందు ఇటలీలో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేసి తిరిగొచ్చారు. హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎలివేటెడ్ లొకేషన్స్ లో పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ని ట్రెయిన్డ్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ తో చిత్రీకరించారని తెలుస్తోంది. 

రవితేజ పాల్గొన్న ఈ బైక్ ఛేజింగ్ సీక్వెన్స్ క్లిప్ చూస్తే ఇందులో హాలీవుడ్ స్థాయి యాక్షన్ ని చూడబోతున్నామని అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలయిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ గ్లింస్ బాగానే అంచనాలు పెంచాయి. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండగా సీనియర్ నటుడు అర్జున్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

More Related Stories