English   

హీరో సూర్య పై బీజేపీ కార్యకర్తలు ఫైర్

 BJP
2021-06-21 14:51:26

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాల గురించి మాత్రమే కాకుండా సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. నేషనల్ ఎంట్రెన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్( నీట్) నిర్వహించడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటమే అవుతుందని తన అభిప్రాయాన్ని సూర్య వెల్లడించారు. ఇలాంటి ప్రవేశ పరీక్షను రద్దు చేయడం చాలా మంచిది అని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. వైద్య విద్య ప్రవేశాల్లో నీట్ అవసరం ఎంత ఉందో తెలుసుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం అధ్యయనం చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సూర్య తన అభిప్రాయం వెల్లడించారు. ఇలాంటి సామూహిక పరీక్షలు విద్యావిధానానికి ఆటంకం కల్పిస్తాయని, ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యావ్యవస్థను రాష్ట్రాలకే వదిలివేయడం మంచిది అని సూర్య తెలిపారు .

ఇలా కాకుండా పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల ప్రాణాలతో తో చెలగాటం ఆడటమే అని అభిప్రాయపడ్డారు. సూర్య తన అభిప్రాయం చెప్పిన వెంటనే బిజెపి కార్యకర్తలు ప్రతి వాదనకు దిగారు. సినిమాల్లో నటిస్తే చాలు బయట కూడా నటించవలసిన అవసరం లేదు అంటూ వారు వాగ్వాదానికి దిగారు. సూర్యాకు ఈ విషయమై తన అభిమానుల నుంచి మంచి సపోర్ట్ లభించింది. సినిమా హీరోలు అంటే కేవలం తెరపై నటించిన వారు మాత్రమే కాదు...నిజ జీవితంలో ప్రజలకు ఉన్న సమస్యలపై కూడా నిర్మొహమాటంగా చెప్పే వాడే నిజమైన హీరో అంటూ తమ హీరోని పొగుడుతున్నారు. మరి ఈ వాగ్వాదం ఎక్కడ వరకు దారితీస్తుందో చూడాలి.

More Related Stories