English   

మా ఎన్నికలు..మంచు విష్ణు వర్సెస్ ప్రకాశ్ రాజ్

Prakash Raj Vs Manchu Vishnu
2021-06-21 17:55:44

రెండేళ్లకు ఒకసారి జరిగే మా అధ్యక్ష ఎన్నికలు గత ఏడాది జరగవలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఎత్తి వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మా ఎన్నికల ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. ఎన్నికలు ఎప్పుడు ఉన్నా సరే 'మా' అధ్యక్షుడిగా పోటీ చేయడానికి సిద్ధం అంటూ ప్రకాష్ రాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.   ప్రకాష్ రాజ్ మూవీ అసోసియేషన్ ప్రతిష్ట మరింత పెంచుకోవడానికి గట్టి పోటీగా ముందుకు వస్తున్నాడు.ఆయనకు నాగబాబు నుండి మద్దతు కూడా లభించింది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ పై పోటీ ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం  మంచు విష్ణు కూడా ఈ సారి ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్దమయ్యాడు. మోహన్ బాబు కుటుంబం అండదండల కారణంగా సమీకరణాలు వేగంగా మారిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే మంచు విష్ణుకు నరేష్ పూర్తి మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ మద్దతు కోసం మంచు విష్ణు, మోహన్ బాబు ఈ రోజు ఆయనని కలిశారు.  దీంతో ఈ ఎన్నికలు మాత్రం గతంలో కంటే రసవత్తరంగా మారేందుకు ఎక్కువ అవకాశాలున్నట్టు కనిపిస్తోంది. ఇక మొత్తానికి మళ్ళీ ఇండస్ట్రీలో మెగా వర్సెస్ మంచు వ్యవహారంలా ఈ ఎన్నికలు మారేట్టు కనిపిస్తోంది.

More Related Stories