English   

ఓటీటీ కి లైగర్... క్లారిటీ ఇచ్చిన రౌడీ హీరో

Vijay Devarakonda
2021-06-22 10:00:45

ఇప్పటివరకు చాలా సినిమాలు ఓటీటీలో విడుదలవుతాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని సినిమాలు మినహా ఎక్కువ సినిమాలు థియేటర్లోనే విడుదల చేస్తామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పూరి జగన్నాథ్..రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ వచ్చిందట. 

ఓటీటీ దాదాపు రూ.200 కోట్ల ఆఫర్ ఇచ్చిందని దాంతో మేకర్స్ ఆలోచనలో పడినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ మీమ్ ను షేర్ చేసి "ఇది చాలా లిటిల్  థియేటర్లో మరిన్ని చూపిస్తాను" అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. మొత్తానికి రౌడీ హీరో తన సినిమా పై వస్తున్న వార్తలకు ఒక మాటతో బ్రేక్ వేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాను పూరి పాన్ ఇండియా చిత్రం గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే రౌడీ పక్కన నటిస్తోంది.

More Related Stories