English   

ఆ సినిమాకు భారీగా పుచ్చుకుంటున్న మాస్ మ‌హ‌రాజ్

Ravi Teja
2021-06-25 13:30:48

మాస్ మహారాజ రవితేజ హిట్ ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా ప్రొడ్యూసర్లకు మినిమమ్ గ్యారంటీ ఇచ్చే హీరోలలో ఒకడు. ఇక ఈ సంవత్సరం మొదట్లోనే 'క్రాక్' సినిమాతో మంచి విజయం సాధించి ఊపు మీద ఉన్నాడు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించడంతో పాటు క‌రోనా లాక్ డౌన్ త‌ర‌వాత విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు రప్పించింది. ఇక ప్ర‌స్తుతం ర‌వితేజ‌  ఖిలాడీ అనే సినిమా లో నటిస్తున్నాడు. 

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే రవితేజ ఈ సినిమా పూర్తవగానే శరత్ మండవ దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ సినిమా చేయబోతున్నాడు. కాగా ఈ సినిమా కోసం రవితేజ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. క్రాక్ సినిమా వరకు 10 నుంచి 12 కోట్లు తీసుకున్న రవితేజ ఇప్పుడు ఈ సినిమా కోసం ఏకంగా 17 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఫిల్మ్ న‌గ‌ర్ లో గుసగుసలు వినబడుతున్నాయి. 

అయితే ఇందులో ఎంత‌వ‌ర‌కూ నిజం ఉందో తెలియ‌దు గానీ ర‌వితేజ రెమ్యున‌రేష‌న్ పెంచేసిన విష‌యం మాత్రం వాస్త‌వ‌మేన‌ని అనిపిస్తుంది. ఇక‌ శరత్ మండవ తమిళ హీరో అజిత్ హీరోగా నటించిన బిల్లా సినిమాకు పని చేశాడు. ఇదే సినిమా తెలుగు వర్షన్ డేవిడ్ బిల్లా కు డైలాగ్ లు కూడా రాశాడు. 

More Related Stories