English   

ఆ అమ్మాయి గొంతుకు కేటీఆర్ ఫిదా..దేవీ శ్రీ ఆఫ‌ర్

KTR
2021-06-25 15:04:22

గుర్తించాలే గానీ మ‌ట్టిలో మాణిక్యాలు ఎన్నో ఉంటాయి. అయితే తాజాగా అలాంటి ఓ మాణిక్యాన్నే తెలంగాణ మంత్రి కేటీఆర్ గుర్తించారు. ఓ మంచి అవ‌కాశం కూడా ఇప్పించారు. వివరాల్లోకి వెళితే... మెదక్ జిల్లా, నారైంగి గ్రామంలో శ్రావణి అనే అమ్మాయి చాలా భాగా ప‌ట‌లు పాడుతుంది. ఈ క్ర‌మంలో శ్రావ‌ణి పాడిన ఓ పాట వీడియోను సురేంద్ర తిప్పరాజు అనే  నెటిజన్ కేటీఆర్ గారికి ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేశాడు. ఇది చూసిన కేటీఆర్ శ్రావణి అనే అమ్మాయి సూపర్ టాలెంటెడ్, ఆమె స్వరం మైమరిపించే లాగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించి... ఆమె టాలెంట్ కు మీ సహకారం తో పాటు మీ ఆశీస్సులు అవసరమని సంగీత ద‌ర్శ‌కులు త‌మ‌న్, దేవీశ్రీ ప్ర‌సాద్ ల‌ను ట్యాగ్ చేశారు. కాగా ఈ వీడియోను చూసిన తమన్ శ్రావణి గొప్ప టాలెంటెడ్ అని , తను ఇలాగే సాధన చేస్తే మంచి స్థాయికి వస్తుందని ప్ర‌శంసించారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ శ్రావ‌ణి స్వరానికి ఫిదా అయ్యానని అన్నారు. అంతే కాకుండా తాను చేసే షోలలో శ్రావణికి అవకాశాలు కల్పిస్తామని తెలిపాడు. ఇలాంటి  టాలెంట్ సింగ‌ర్ గురించి మాకు తెలియజేసినందుకు ధ‌న్య‌వాదాలు అంటూ దేవిశ్రీప్రసాద్.. కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపాడు.

More Related Stories