English   

కత్తి మహేష్ హెల్త్ అప్డేట్

Kathi Mahesh
2021-06-28 07:49:51

టాలీవుడ్ నటుడు సినిమా క్రిటిక్ కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆయనకు నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం కత్తి మహేష్ ను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే తాజాగా కత్తి మహేష్ ఆరోగ్యపరిస్థితిపై ఆయన స్నేహితుడు ఓ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతానికి కత్తి మహేష్ కు ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పారు. కానీ చికిత్స తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. అయితే అవి ఏంటి అన్నదానిపై డాక్టర్లు ఇంకా నిర్ధారణకు రాలేదు. ప్రస్తుతం రెస్పిరేషన్ లేదని ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు. కత్తి మహేష్ గానికి తీవ్రమైన గాయం కావడం వల్ల శంకర్ నేత్రాలయ నుండి వైద్య బృందం వచ్చి పరిశీలిస్తోంది. అంతేకాకుండా ముక్కు భాగంలో ఒక ఎముక విరిగి పోవడంతో దానికి సర్జరీ చేయాల్సి ఉందను డాక్టర్లు వెల్లడించారు. అంతేకాకుండా బ్రెయిన్ లో కూడా ఒక చిన్న గాయం అయినట్లు తెలుస్తోంది.

More Related Stories