English   

జెర్సీ సినిమా పై ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ప్రశంసలు

Amanda bailey
2021-06-28 15:02:31

కొన్ని సినిమాలు కమర్షియల్ గా విజయాన్ని సాధిస్తాయి కానీ మనసుకు పెద్దగా హత్తుకోవు. అలాగే మరికొన్ని సినిమాలు మనసు హత్తు కోవడమే కాదు గుండెను పిండేస్థాయి కూడా అలాంటి సినిమాల్లో ఒకటి నాని హీరోగా నటించిన 'జెర్సీ'. ఈ సినిమా ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతానికి ఈ దర్శకుడు ఇదే కథను 'షాహిద్ కపూర్' హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నాడు. 

ఇదిలా ఉండగా ఇప్పటికే జెర్సీ సినిమాకు నేషనల్ అవార్డు కూడా దక్కింది. అంతే కాకుండా పలువురు బాలీవుడ్ నటీనటులు సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు సంపాదించుకున్న 'జెర్సీ' సినిమా కు తాజాగా మరో గుర్తింపు వచ్చింది. ఆస్ట్రేలియా ప్రముఖ జర్నలిస్ట్ 'అమండా బైలీ' జెర్సీ సినిమాకు ఫిదా అయినట్లు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది. ఈ సినిమా కొనసాగుతున్నంతసేపు నాని క్యారెక్టర్ తో ఎమోషనల్ గా ఫీల్ అయ్యానని... ముఖ్యంగా రైల్వే స్టేషన్ సీన్ తనకు బాగా నచ్చిందని తెలిపింది. ఇక సినిమా వచ్చి ఇంత కాలం అవుతున్నా జెర్సీ హవా ఇంకా కొనసాగుతూనే ఉండటం తెలుగు సినిమాకు గర్వకారణం.

More Related Stories