English   

నా మా కుటుంబానికి మంచు విష్ణు లేఖ

manchu vishnu
2021-06-28 08:11:36

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు 'మంచు విష్ణు' మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దానికి సంబంధించి 'మంచు విష్ణు' తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో మంచు విష్ణు.... నేను'మా' అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని నా మా కుటుంబ సభ్యులైన మీకు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు పరిశ్రమ వల్ల ఇంతలా ఎదిగి, పేరు ప్రతిష్ఠలు సంపాదించు కొన్నందుకు ఆనందంగా ఉంది. సినిమా పరిశ్రమ ఎదురుకుంటున్న కష్టనష్టాల గురించి నాకు బాగా తెలుసు. 'మా' కుటుంబ సభ్యుల భావాలు, బాధలు కూడా నాకు తెలుసు. నన్ను మా కుటుంబ సభ్యులను ఇంత లా ఆదరించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మీ రుణం తీర్చుకోవడానికి... మీకు సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నాను. 

మా నాన్నగారు మా అసోసియేషన్ అధ్యక్షుడిగా చేసిన సేవలు ఆయన విధానాలు నాకు మార్గదర్శకం. నేను గతంలో 'మా' అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేసినప్పుడు "మా" బిల్డింగ్ నిర్మాణానికి నా తరఫున... నా కుటుంబం తరఫున అయ్యే ఖర్చులో 25% ఇస్తానని తెలిపాను. కానీ ఆ బిల్డింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో మా కుటుంబ సభ్యుల అవసరాలను అతి దగ్గర నుంచి చూశాను.. ఆ అవసరాలను తీర్చడానికి కొన్ని సలహాలు సూచనలు చేశాను. 'మా' కుటుంబ సహకారంతో వాటిని పూర్తి చేసాను. నాకు 'మా' కుటుంబ సభ్యులకు ఏం అవసరమో స్పష్టమైన అవగాహన ఉంది... వారి కష్టాలను తీర్చడానికి ఎప్పుడూ నేను ముందుంటాను. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా కళాకారులందరికీ నా సేవలు సంపూర్ణంగా అందిస్తానని కోరుతున్నాను"...అంటూ మంచు విష్ణు లేఖలో పేర్కొన్నారు.

More Related Stories