English   

శంకర్ కూతురి పెళ్లికి తమిళనాడు సీఎం

CM MK Stalin
2021-06-28 08:16:23

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ వివాహం జరిగింది. ఐశ్వర్య శంకర్ ను తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో స్టార్ క్రికెటర్ గా పేరు సాధించిన రోహిత్ దామోదరన్ వివాహం చేసుకున్నారు. రోహిత్ తండ్రికి తమిళనాడులో ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త గా పేరు ఉంది. ఇక ఐశ్వర్య రోహిత్ ల వివాహం ఈరోజు మహాబలిపురం లో జరిగింది. 

కరోనా విజృంభించిన నేపథ్యంలో అతి కొద్దిమంది మాత్రమే మీరు పెళ్లికి హాజరయ్యారు. అయితే హాజరైన వారిలో పలువురు ఇండస్ట్రీ పెద్దలు, స్నేహితులు, ఇతర ప్రముఖులతోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వివాహానికి హాజరై దంపతులను ఆశీర్వదించారు. ఇక శంకర్ కు మరో కుమారుడితో పాటు ఒక కుమార్తె కూడా ఉంది. ఇది ఇలా ఉండగా శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమా తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ లో అపరిచితుడు సినిమా రీమేక్ చేస్తున్నారు. ఇదిలా ఉండగానే టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.

More Related Stories