English   

ఆ నటుడి శవం ముందు హీరోయిన్ డ్యాన్స్ లు

Nandini Rai
2021-06-28 11:14:26

కొంతమందికి డాన్స్ అంటే చాలా ఇష్టపడతారు.. వారు ఎక్కడ పెళ్లిళ్లు అయినా వేరే ఏ రకమైన కార్యక్రమాలు అయినా తమ డ్యాన్స్ తో జనాలను ఆకట్టుకోవాలని అనుకుంటారు. ఇదే డాన్స్ సందర్భానికి అనుగుణంగా చేస్తే జనాలు చప్పట్లు కొడతారు. అదే సందర్భం లేకుండా ఇష్టం ఉన్న ప్రదేశాల్లో చేస్తేనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు నటి నందిని రాయ్ కూడా శవం ముందు స్టెప్పులు ఎలాంటి విమర్శలే ఎదుర్కోవలసి వస్తుంది. అయితే నందినీ రాయ్ డ్యాన్స్ చేసింది నిజమైన శవం ముందు కాదు. షూటింగ్ లో ఉత్తుత్తి శవం ముందు. 

నందిని రాయ్ ఇటీవల 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' అనే వెబ్ సిరీస్ లో నటించన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో నందిని రాయ్  'జగమే తంత్రం' సినిమాలోని రకిట రకిట పాటకు వీరలెవల్లో స్టెప్పులేసింది. అయితే దీనిలో తప్పేముంది అని మీరు అనుకోవచ్చు. ఇదే సెట్లో శవం ముందు ఈ స్టెప్పులేసింది. అయితే ఇది నిజంగా శివం కాదు కేవలం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం వేసిన సెట్. ఆ శవం సెట్ కు పోసాని కృష్ణ మురళి ఫోటో కనిస్తోంది. దాంతో పోసాని శవం ముందు నందిని రాయ్ డ్యాన్స్ అంటూ వైరల్ అవుతోంది. అయితే కొంతమంది దానిని కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోణంలో చూడగా... మరికొంతమంది మాత్రం ఇలా శవం ముందు డాన్స్ చేయడం...ఆ వీడియోలు పోస్ట్ చేయడం కరెక్ట్ కాదని విమర్శలు కురిపిస్తున్నారు.

More Related Stories