మా ఎలక్షన్స్..తెలంగాణ వాదానికి రాములమ్మ సపోర్ట్

మా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల జాబితా రోజురోజుకు పెరుగుతుంది. మొదట ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య మాత్రమే పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు. అంతలోనే జీవిత రాజశేఖర్ నేను కూడా బరిలో ఉన్నానని చెప్పడంతో త్రిముఖ పోరు తప్పదు అనుకున్నారు. ఆ వెంటనే హేమ , సీనియర్ నటుడు సాయికుమార్ తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు గా ప్రకటించుకున్నారు. ఈ రసవత్తరమైన పోరులో ఎవరి ప్యానల్ లను వారు ప్రకటించుకుంటూ వారి మద్దతుదారులతో కలిసి మీడియా ముందుకు వస్తున్నారు.
అయితే ఇంతటితో అభ్యర్థుల జాబితా ముగుస్తుందని అనుకున్న సమయంలో మరొక నటుడు కూడా నేను 'మా' అధ్యక్ష బరిలో ఉన్నాను అంటూ ప్రకటించుకున్నాడు. అతనే సివిఎల్ నరసింహారావు. కాగా సీవిఎల్ నరసింహరావుకు నటి విజయశాంతి మద్దతు తెలిపారు. మరియు నాకు 'మా' సభ్యత్వం లేకపోయినా తెలంగాణ కళాకారులకు న్యాయం జరిగేందుకు సీవీఎల్ కృషి చేస్తాడని తన మాటల ద్వారా అర్థమవుతుందని అందుకే అతనికి మద్దతు చేస్తున్నా అని తెలిపింది. మధ్యతరగతి , చిన్న కళాకారులకు ,తెలంగాణ కళాకారులకు న్యాయం జరగాలని పోటీ చేస్తున్నట్లు సివిఎల్ నరసింహారావు తెలిపారు . 'మా' కు సంబంధించిన ఎన్నికలను కూడా తెలంగాణ.. ఆంధ్ర ప్రదేశ్ లకు వేరు వేరుగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.