English   

చిత్ర‌ప‌రిశ్ర‌మ నుండి ఓటీటీ..ఆ సినిమాల‌న్నీ అందులోనే

OTT
2021-06-29 09:16:58

తమిళనాడు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. గత 2015 నుంచి 2021 మధ్యకాలంలో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోని సినిమాల వివరాలను సేకరిస్తోంది. ఈ మేరకు ఆయా చిత్రాల నిర్మాతలకు ఓ విజ్ఞప్తి చేసింది. విడుదలకు నోచుకోలేని చిత్రాల వివరాలను ఆయా నిర్మాతలు ఈనెల 28వ తేదీలోపు సమర్పించాల్సిందిగా కోరింది. 2015-2021 మధ్యకాలంలో నిర్మించి, విడుదలకాని చిత్రాలు, డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులు విక్రయించని సినిమాలు, థియేటర్‌లో విడుదల చేయలేకపోయిన చిత్రాలు, ఒకవేళ నిర్మాణం పూర్తి చేసుకుని ఏదో ఒక సంస్థకు హక్కులు కేటాయించినప్పటికీ ఆ వివరాలను కూడా వెల్లడించాలని కోరింది. అలాగే, ఆయా చిత్రాల్లో నటించిన హీరో హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు, ఆ చిత్రం ప్రస్తుతం ఏ ల్యాబ్‌లో ఉంది, సంబంధిత చిత్రంలో ఏదేని సమస్య ఉన్నట్టయితే ఆ సమస్య, దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా సమర్పించాలని కోరింది. ఈ వివరాలన్నీ సంబంధిత చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన లెటర్‌హెడ్‌పై లిఖితపూర్వకంగా రాసివ్వాలని కోరింది. త్వరలో తమిళ చిత్ర నిర్మాతల మండలి ఒక ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ప్రారంభించనుంది. ఇందులో ఈ చిత్రాలను విడుదల చేసేందుకే ఈ వివరాలను కోరినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. 

More Related Stories