English   

నిర్మాత‌ల‌కు షాక్ ఇస్తున్న న‌య‌న్

 Nayanthara
2021-06-29 09:22:10

సౌత్ సినిమాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. ఈ ముద్దుగుమ్మ దాదాపుగా సౌత్ లో ఉన్న అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్న ఈ హీరోయిన్. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమాలో లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో ఆడిపాడనుంది. ఈ సినిమాను దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కోసం నయనతార తన రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచినట్లు తెలుస్తోంది .

దక్షిణాదిన ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు కోట్ల వరకు తీసుకునే నయనతార బాలీవుడ్ డెబ్యూ మూవీ కోసం మాత్రం ఆరు నుంచి ఎనిమిది కోట్ల డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో తో ప్రొడ్యూసర్లు షాక్ అయినట్లు, ఆ తర్వాత దక్షిణాది మార్కెట్ తో పోల్చుకుంటే బాలీవుడ్ మార్కెట్ పెద్దది కాబట్టి వారు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హీరోయిన్ ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఈ కథలో దక్షిణాది నేపథ్యం ఎక్కువగా ఉండడమేనని తెలుస్తోంది. నయనతార కు దక్షిణాదిలో ఉన్నంత క్రేజ్ని బాలీవుడ్లో తెచ్చుకుంటుందో లేదో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

More Related Stories