English   

రజినీ యుఎస్ ట్రిప్ పై నటి సంచలన వ్యాఖ్యలు

Rajnikanth
2021-06-29 09:29:24

సూపర్ స్టార్ రజినీకాంత్ హెల్త్ జనరల్ చెకప్ కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అమెరికాకు విదేశీయులను అనుమతించడం లేదు. కేవలం రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులు మరియు ఉద్యోగులను మాత్రమే అనుమతిస్తుంది. విజిటర్స్ ను అనుమతించడం లేదు. కానీ రజినీకాంత్ భారత్ నుండి ప్రత్యేక అనుమతులతో అమెరికా వేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా రజనీకాంత్ టూర్ పై నటి కస్తూరి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా వేదికగా కస్తూరి చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

రజనీకాంత్ సార్ అమెరికాకు సడెన్ వెళ్లడం పై తనకు అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఎవరికి అనుమతులు దొరకని సమయంలో రజినీకాంత్ కు ఎలా అనుమతి లభించిందని ప్రశ్నించింది. జనరల్ చెకప్ కోసం భారత ప్రభుత్వం నుండి అనుమతి తీసుకుని మరీ ఎందుకు వెళ్లినట్టు అంటూ ప్రశ్నించింది. రజినీకాంత్ రాజకీయాలకు గుడ్ బై చెప్పడం... అమెరికా పర్యటనకు వెళ్లడం పై తనకు అనుమానాలు వస్తున్నాయని అంటూ పేర్కొంది. ఇక కస్తూరి చేసిన పోస్ట్ తో ఇప్పటివరకు ఎలాంటి అనుమానం లేని వారికి కూడా కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

More Related Stories